Maduro: మదురోను పట్టుకునే ఆపరేషన్ లో అమెరికా సోనిక్ వెపన్ వాడిందా... గార్డు ఏం చెప్పాడంటే...!
- వెనెజువెలా అధ్యక్షుడు మదురో అరెస్టులో అమెరికా సోనిక్ ఆయుధం ప్రయోగం
- భయంకర శబ్ద తరంగాలకు సైనికుల ముక్కుల నుంచి రక్తం, వాంతులు
- 20 మంది అమెరికా సైనికులతోనే వందలాది మందిని నిర్వీర్యం చేసిన వైనం
- ఇవి డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలని నిపుణుల విశ్లేషణ
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించేందుకు అమెరికా సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్'లో అత్యంత శక్తివంతమైన, రహస్య ఆయుధాన్ని ప్రయోగించినట్లు సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా డెల్టా ఫోర్స్ ప్రయోగించిన భయంకరమైన ధ్వని తరంగాల దాటికి వెనెజువెలా సైనికులు ముక్కుల నుంచి రక్తస్రావంతో, వాంతులతో కుప్పకూలిపోయారని మదురోకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన ఓ సెక్యూరిటీ గార్డ్ వెల్లడించాడు.
జనవరి 3న జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. మదురో సెక్యూరిటీ గార్డ్ ఇంటర్వ్యూ ప్రకారం, దాడికి ముందు అకస్మాత్తుగా రాడార్ వ్యవస్థలు పూర్తిగా మూగబోయాయి. వెంటనే డ్రోన్ల సమూహం, 8 హెలికాప్టర్లతో పాటు కేవలం 20 మంది అమెరికా డెల్టా ఫోర్స్ సైనికులు మదురో నివాసాన్ని చుట్టుముట్టారు. వందలాది మంది వెనెజువెలా రక్షణ సిబ్బంది ఉన్నప్పటికీ, అమెరికా సాంకేతిక ఆయుధాల ముందు వారు నిస్సహాయులయ్యారు.
ఆ భయానక క్షణాలను ఆ గార్డ్ వివరిస్తూ, "ఒక దశలో వారు ఏదో ప్రయోగించారు. దాన్ని మాటల్లో వర్ణించలేను. అది నా తల లోపలి నుంచి పేలిపోతున్నట్లు అనిపించే తీవ్రమైన ధ్వని తరంగం. మా అందరి ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైంది. కొందరు వాంతులు చేసుకోగా, మరికొందరు స్పృహతప్పి నేలపై పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిలబడలేకపోయాం. ఇలాంటి ఆయుధాలు కలిగిన అమెరికాతో ఎవరూ పోరాడలేరు" అని వ్యాఖ్యానించాడు.
సైనికులపై కనిపించిన లక్షణాల ఆధారంగా, ఇది సోనిక్ ఆయుధంతో పాటు మైక్రోవేవ్స్, లేజర్ వంటి 'డైరెక్టెడ్ ఎనర్జీ' ఆయుధాల కలయిక అయి ఉండవచ్చని అమెరికా నిఘా వర్గాల్లో పనిచేసిన ఓ మాజీ అధికారి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆయుధాలు అమెరికా సైన్యం వద్ద దశాబ్దాలుగా ఉన్నాయని, అవి శత్రువులలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, నిస్సత్తువను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో 2020 గల్వాన్ ఘర్షణలో చైనా కూడా భారత సైనికులపై మైక్రోవేవ్ ఆయుధాన్ని ప్రయోగించిందని ఆరోపణలు వచ్చినా, బీజింగ్ వాటిని ఖండించింది.
శబ్దమే ఆయుధం.. చరిత్ర నుంచి ఇప్పటిదాకా సోనిక్ వెపన్స్ ప్రస్థానం
శబ్దాన్ని ఆయుధంగా వాడటం కొత్తేమీ కాదు. సుమారు 3,500 ఏళ్ల క్రితం యెరికో గోడలను కూల్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం ట్రంపెట్లు వాడినట్లు బైబిల్‌లో ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ కూడా 'సోనిక్ కానన్' అనే ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. ఇది మీథేన్ గ్యాస్ ద్వారా శక్తివంతమైన పల్స్‌లను సృష్టించి, సమీపంలోని వారి అంతర్గత అవయవాలను దెబ్బతీసేలా రూపొందించబడింది.
ఆధునిక సోనిక్ ఆయుధాల అభివృద్ధి 2000 సంవత్సరంలో యెమెన్‌లో USS కోల్ నౌకపై దాడి తర్వాత వేగవంతమైంది. 2005లో సోమాలియా సముద్రంలో పైరేట్ల నుంచి ఒక క్రూయిజ్ షిప్ LRAD సహాయంతోనే తప్పించుకుంది. అప్పటి నుంచి అమెరికాలోని ఫెర్గూసన్, ఆక్యుపై వాల్ స్ట్రీట్, జార్జ్ ఫ్లాయిడ్ నిరసనల వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీని వినియోగం వివాదాస్పదమైంది. సుమారు 100 దేశాలు ఈ టెక్నాలజీని వాడుతున్నాయి.
వీటిని 'నాన్-లెథల్' (ప్రాణాంతకం కాని) ఆయుధాలుగా వర్గీకరించినా, వీటి వల్ల శాశ్వత వినికిడి లోపం, తలనొప్పి, మానసిక సమస్యలు వస్తాయని ఆందోళనలున్నాయి. క్యూబాలో అమెరికా దౌత్యవేత్తలు ఎదుర్కొన్న 'హవానా సిండ్రోమ్' వెనుక ఇలాంటి ఆయుధాలే ఉండొచ్చనే వాదనలు ఈ చర్చను మరింత తీవ్రతరం చేశాయి.