Donald Trump: బందీగా మదురో... తొలి ఫొటో విడుదల చేసిన ట్రంప్

Donald Trump Releases Photo of Nicolas Maduro in Custody
  • వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అమెరికా సైన్యం
  • బందీగా ఉన్న మదురో ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్
  • కారకాస్‌లో డెల్టా ఫోర్స్ రహస్య ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడి
  • న్యూయార్క్‌లో నార్కో టెర్రరిజం ఆరోపణలపై విచారణకు రంగం సిద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సైన్యం చేతచిక్కిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధించిన ఒక ఫొటోను తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశారు. కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసి ఉన్న మదురో... యూఎస్ నేవీకి చెందిన యుద్ధనౌక యూఎస్‌ఎస్ ఐవో జిమాపై ఉన్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. "నికోలస్ మదురో యూఎస్‌ఎస్ ఐవో జిమా నౌక పై ఉన్నాడు" అని ట్రంప్ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.

వెనిజులా రాజధాని కారకాస్‌లో అమెరికా సైన్యం భారీ సైనిక ఆపరేషన్ నిర్వహించి మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో యూఎస్ ఆర్మీకి చెందిన ‘డెల్టా ఫోర్స్’ కీలక పాత్ర పోషించింది.

ఈ ఆపరేషన్ వివరాలను ఫాక్స్ & ఫ్రెండ్స్ కార్యక్రమంలో ట్రంప్ పంచుకున్నారు. కొంతమంది అమెరికా సైనికులు గాయపడ్డారని, అయితే ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు. నార్కో-టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణల కింద మదురో దంపతులు న్యూయార్క్‌లో విచారణ ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ సమయంలో కారకాస్‌లో భారీ పేలుళ్లు, తక్కువ ఎత్తులో విమానాల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇది అమెరికా దురాక్రమణేనని వెనిజులా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ అనూహ్య పరిణామంపై అంతర్జాతీయంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

Donald Trump
Nicolas Maduro
Venezuela
USS Iwo Jima
US Navy
Caracas
Delta Force
Narco-terrorism
Drug Trafficking
Cilia Flores

More Telugu News