నేడు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలు... హాజరుకానున్న విదేశాంగ మంత్రి జైశంకర్
- ఢాకాలోని జియా ఉద్యాన్‌లో నేడు ఖలీదా జియా అంత్యక్రియలు
- ఖలీదా జియా మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
- భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి ఆమె చేసిన కృషిని ప్రశంసించిన మోదీ
ఖలీదా జియా మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 2015లో ఢాకా పర్యటన సందర్భంగా ఆమెతో భేటీ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న మోదీ, భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి ఆమె చేసిన కృషిని ప్రశంసించారు.
ఇదిలా ఉండగా, ఖలీదా జియా మరణంపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా సంతాపం ప్రకటించారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఖలీదా జియా కీలక పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నారు.