పోలీసుల అదుపులో ఉన్న దేవ్‌జీ సహా 50 మందిని కోర్టులో హాజరుపరచాలి: మావోయిస్టుల డిమాండ్
- దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నారన్న దండకారణ్య కమిటీ
- హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని వ్యాఖ్య
- ఎన్కౌంటర్లకు నిరసనగా 30న దండకారణ్యం బంద్
ఈ నెల 22వ తేదీతో ఉన్న ఈ లేఖలో, ఇటీవలే జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 18న హిడ్మా సహా ఆరుగురిని బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని ఆరోపించింది. ఆ తర్వాతి రోజే, అంటే నవంబర్ 19న, అదే ప్రాంతంలో సురేశ్, శంకర్ సహా మరో ఏడుగురిని కూడా ఇలాగే హత్య చేశారని లేఖలో పేర్కొంది.
ఈ బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30వ తేదీన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, మావోయిస్టుల ఆరోపణలపై పోలీసుల నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.