కారు డ్రైవర్ కు గుండెపోటు.. ప్లైఓవర్ పై కారు బీభత్సం.. వీడియో ఇదిగో!
- ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టిన కారు
- ప్లైఓవర్ పైనుంచి ఎగిరి కిందపడ్డ బైకర్
- అక్కడికక్కడే నలుగురి దుర్మరణం
- మహారాష్ట్ర థానే జిల్లాలోని అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై ఘటన
ఠాణె జిల్లా అంబర్ నాథ్ ప్లైఓవర్ పై శుక్రవారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. శివసేన పార్టీ నేత కిరణ్ చాబే కారులో వెళుతుండగా డ్రైవర్ లక్ష్మణ్ షిండే గుండెపోటుకు గురయ్యాడు. అంబర్ నాథ్ ప్లైఓవర్ పైకి ఎక్కిన తర్వాత కారు అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న బైక్‌లు, ఇతర వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఓ బైకర్ ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. కారు డ్రైవర్ షిండేతో పాటు మరో ముగ్గురు వాహనదారులు మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కిరణ్ చాబె ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.