తిరుమల కొండల్లో కొత్త జీవి.. అరుదైన బల్లి జాతి గుర్తింపు

Venkataadri slender gecko New lizard species discovered in Tirumala
  • కొత్త బల్లిజాతిని గుర్తించిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు
  • ‘వెంకటాద్రి స్లెండర్ గెక్కో’గా నామకరణం 
  • అంతర్జాతీయ జర్నల్ ‘హెర్పటోజోవా’లో ఆవిష్కరణ వివరాలు
శేషాచలం అడవులు మరో అరుదైన జీవికి నిలయంగా నిలిచాయి. తిరుమల కొండల్లోని దట్టమైన చందనపు అడవిలో శాస్త్రవేత్తలు సరికొత్త బల్లి జాతిని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు ఈ జీవిని గుర్తించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ దీనికి ‘వెంకటాద్రి స్లెండర్ గెక్కో’ అని పేరు పెట్టారు.

ఈ కొత్త బల్లి జాతి పలుచగా, తొండను పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. చందనపు చెట్టు బెరడు కింద నివసిస్తున్న సమయంలో దీనిని గుర్తించినట్లు వారు వివరించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ జర్నల్ ‘హెర్పటోజోవా’లో ప్రచురించారు.

ఈ కీలక పరిశోధనలో పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫ్రెష్‌వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్, కోల్‌కతాలోని రెప్లిల్లా విభాగం, ఒడిసాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. శేషాచలం అడవుల జీవవైవిధ్యానికి ఈ కొత్త ఆవిష్కరణ మరో నిదర్శనమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Venkataadri slender gecko
Tirumala
Seshachalam forests
new lizard species
Zoological Survey of India
Herpetozoa
chandan forests
Eastern Ghats
biodiversity

More Telugu News