Kathi Suresh: కూరలో వయాగ్రా టాబ్లెట్లు.. మద్యంలో బీపీ మాత్రలు కలిపి భర్త హత్య

Wife Murders Husband mixing Viagra BP Tablets in Curry Liquor
  • కరీంనగర్ లో ఓ మహిళ కిరాతకం
  • చెడు అలవాట్లకు బానిసైన మహిళ
  • స్నేహితులతో కలిసి భర్తను తుదముట్టించిన భార్య
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళ చెడు అలవాట్లకు బానిసైంది.. భర్తతో విభేదాలతో విసిగిపోయి స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ తో భర్తను తుదముట్టించింది. స్నేహితుల సలహాతో కూరలో వయాగ్రా మాత్రలు కలిపి భర్తకు పెట్టింది. కూర వదిలేయడంతో మద్యంలో బీపీ మాత్రలు కలిపి తాగించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను చీరతో ఉరేసి చంపేసింది. కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో చోటుచేసుకుందీ ఘోరం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సప్తగిరి కాలనీలో కత్తి సురేశ్, మౌనిక నివాసం ఉంటున్నారు. పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ జంటకు ఇద్దరూ పిల్లలు ఉన్నారు. సురేశ్ టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల మౌనిక చెడు అలవాట్లకి బానిసగా మారింది. దీంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సురేశ్ ను హత్య చేయాలని మౌనిక ఫ్లాన్ చేసింది. తన బంధువు అరిగే శ్రీజకు తన ప్లాన్ చెప్పి సాయం కోరింది. శ్రీజ మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ, మరో‌ స్నేహితురాలు‌ సంధ్యను మౌనికకు పరిచయం చేసింది. వీరంతా కలిసి సురేశ్ హత్యకు ప్రణాళిక రూపొందించారు.

కూరలో వయాగ్రా మాత్రలు కలిపి..
శివకృష్ణ సూచనలతో కూరలో వయాగ్రా మాత్రలు కలిపిన మౌనిక.. ఆ కూరను తన భర్త సురేశ్ కు వడ్డించింది. అయితే, కూర వాసన రావడంతో సురేశ్ తినకుండా వదిలేశాడు. దీంతో మౌనిక ప్లాన్ ఫెయిలైంది. తర్వాత, బీపీ మాత్రలను మద్యంలో కలిపి సురేశ్ కు ఇచ్చింది. ఈసారి సురేశ్ తప్పించుకోలేకపోయాడు. ఆ మద్యం తాగి సురేశ్ స్పృహ కోల్పోగా.. మౌనిక తన పాత చీరతో కిటికీ గ్రిల్ కు ఉరేసి సురేశ్ ను చంపేసింది.

ఆసుపత్రికి తీసుకెళ్లి నాటకం..
ఈ హత్యని‌ కప్పి పుచ్చేందుకు మౌనిక వెంటనే సురేశ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. సురేశ్ అనారోగ్యం పాలయ్యాడని చెప్పి ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపింది. అప్పటికే సురేశ్ మరణించాడని వైద్యులు నిర్ధారించడంతో సాధారణ మరణంగా నమ్మించేందుకు మౌనిక ప్రయత్నించింది. పోలీస్ కేసు పెడితే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని బంధువులు చెప్పడంతో సురేశ్ తల్లిదండ్రులు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మౌనిక ప్రవర్తనపై అనుమానంతో గట్టిగా ప్రశ్నించగా హత్య విషయం బయటపడింది. దీంతో మౌనికతో పాటు శ్రీజ, శివకృష్ణ, అజయ్, సంధ్య దేవదాసులని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
Kathi Suresh
Murder
Karimnagar
Wife
Viagra tablets
BP medicine
Saptagiri Colony
Extra marital affair
Telangana crime news

More Telugu News