అంబర్ పేట ర్యాలీలో కిందపడిన వీహెచ్
- బీసీ బంద్‍కు మద్దతుగా అంబర్‌పేటలో ర్యాలీ
- బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు
- వీహెచ్‌ను లేపి సపర్యలు చేసిన నాయకులు
ఈ ర్యాలీ సందర్భంగా ఫ్లెక్సీ పట్టుకుని ముందు నడుస్తున్న వి. హనుమంతరావు బ్యానర్ తట్టుకుని ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. వెంటనే నాయకులు ఆయనను పైకి లేపి సపర్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతమైంది. యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు.