సముద్రంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. నౌకలపై ప్రత్యేక ఛార్జీ వసూలు
- పరస్పరం ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తున్న ఇరుదేశాలు
- అమెరికా జెండాతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీని వసూలు చేస్తామన్న చైనా
- చైనా నిర్మించిన నౌకలకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వెల్లడి
అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. వాణిజ్య యుద్ధం, టారిఫ్‌ల అంశంపై తమ వైఖరి స్థిరంగా ఉందని, అమెరికా ఈ తరహా యుద్ధం కోరుకుంటే తాము చివరి వరకు పోరాడుతామని పేర్కొంది. ఒకవేళ చర్చలు జరపడానికి సిద్ధమైతే, అందుకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.