దుల్కర్ సల్మాన్ నివాసంలో కస్టమ్స్ రెయిడ్
- పృథ్విరాజ్ సుకుమారన్ నివాసంలోనూ సోదాలు
- పన్ను ఎగవేత ఆరోపణలపై కస్టమ్స్ అధికారుల స్పందన
- ‘ఆపరేషన్ నమకూర్’ పేరుతో కేరళలో 30 చోట్ల సోదాలు
ఓ ఆన్ లైన్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. లగ్జరీ కార్లను భూటాన్ నుంచి అక్రమంగా తెప్పించుకున్నారని దుల్కర్, పృథ్విరాజ్ లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు భూటాన్ ఆర్మీకి చెందిన హైఎండ్ వాహనాలను కొనుగోలు చేసి అక్రమంగా రీసేల్ చేసే గ్యాంగు నుంచి నటులు వాహనాలను కొనుగోలు చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.
భూటాన్ లో నిర్వహించే వేలంలో ఖరీదైన వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్ లోకి తీసుకొచ్చి సెలబ్రెటీలకు అమ్మడమే ఈ ముఠా పని అని తెలుస్తోంది. కాగా, పృథ్విరాజ్ సుకుమారన్ నివాసంలో జరిపిన సోదాల్లో అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం.