Biju Janata Dal: ఉప రాష్ట్రపతి ఎన్నికలు... బీఆర్ఎస్ బాటలో మరో పార్టీ

Biju Janata Dal to abstain from Vice President Election like BRS
షార్ట్స్‌లో చూడండి
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉండాలని ఒడిశాకు చెందిన కీలక ప్రాంతీయ పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) నిర్ణయించింది. బీఆర్ఎస్ ఇప్పటికే ఇదే వైఖరిని ప్రకటించగా, తాజాగా బీజేడీ కూడా ఆ జాబితాలో చేరింది. రేపు జరగనున్న ఓటింగ్‌లో తమ పార్టీ ఎంపీలు పాల్గొనబోరని బీజేడీ రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్రా ఢిల్లీలో వెల్లడించారు.

ఈ అంశంపై పార్టీ ఎంపీలు, రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించిన అనంతరం బీజేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ తుది నిర్ణయం తీసుకున్నారని సస్మిత్ పాత్రా తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి సమాన దూరం పాటించాలన్న తమ పార్టీ విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. తమ పూర్తి దృష్టి ఒడిశా రాష్ట్ర అభివృద్ధి, 4.5 కోట్ల మంది ప్రజల సంక్షేమంపైనే కేంద్రీకృతమై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బిజూ జనతాదళ్‌కు ఏడుగురు సభ్యుల బలం ఉంది.

రేపు జరగనున్న ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. రెండు కూటములకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
Go Back to Shorts
Biju Janata Dal
BJD
Odisha
Vice President Election
BRS
Naveen Patnaik
Sasmit Patra
NDA
INDIA alliance
Justice Sudarshan Reddy

More Telugu News