పవన్ కల్యాణ్ 'ఓజీ' నుంచి ప్రియాంక అరుల్ మోహన్ లుక్ విడుదల
- పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ
- హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్
- 'కన్మణి' పాత్ర లుక్ విడుదల చేసిన మేకర్స్
'రన్ రాజా రన్', 'సాహో' చిత్రాల ఫేమ్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను మునుపెన్నడూ చూడని శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ 'ఓజాస్ గంభీర' అనే పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. తాజా పోస్టర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. భారీ తారాగణంతో, ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
