ఎవరి కాళ్లో పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే మంత్రి పదవి వచ్చేదన్న కోమటిరెడ్డి
- మంత్రినైతే బాగుంటుందని మునుగోడు ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య
- వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా మంత్రి పదవులు ఇచ్చారని విమర్శ
తాను మంత్రినైతే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, తన జూనియర్లకు కూడా మంత్రి పదవులు ఇచ్చారని... ఎవరి కాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తన నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయనని చెప్పారు.