Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యల ఎఫెక్ట్ .. ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు
- పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్సీ దువ్వాడ ఆరోపణలు
- దువ్వాడపై హిరమండలం పీఎస్‌లో జనసేన నేత ఫిర్యాదు
- దువ్వాడకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత ఆరోపణలు చేసిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్‌లో దువ్వాడపై కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నెలకు రూ.50 కోట్ల చొప్పున సీఎం చంద్రబాబు నుంచి తీసుకుంటూ ప్రశ్నించడం లేదని విమర్శలు చేశారు.
దువ్వాడ చేసిన ఈ వ్యాఖ్యలపై హిరమండలం జనసేన నాయకుడు పంజరాపు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన హిరమండలం పోలీసులు నిన్న ఎమ్మెల్సీ దువ్వాడకు టెక్కలి సమీపంలోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు.