బీహార్‌లో షాకింగ్ ఘటన.. భర్త నాలుక కొరికి మింగేసిన భార్య!
- బీహార్‌లోని గయాలో ఘటన
- భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న గొడవ
- మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసిన వైనం
- ఆగ్రహంతో ఊగిపోయి భర్త నాలుక కొరికి నమిలి మింగేసిన భార్య
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది. దాంతో తీవ్ర రక్తస్రావమై భర్త ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావడంతో స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చాలా రక్తం పోయినందున ప్రాథమిక చికిత్స చేసి మగధ్ కళాశాలకు సిఫార్సు చేసినట్లు డాక్టర్ మీనారాణి తెలిపారు.
అయితే, ఇంత జరిగినా ఆసుపత్రిలోనూ ఆ దంపతులు గొడవకు దిగారని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.