ఓటీటీ ట్రాక్ పైకి తమిళ థ్రిల్లర్
- తమిళంలో రూపొందిన 'మనిదర్గళ్'
- మే 30న థియేటర్లకు వచ్చిన సినిమా
- స్నేహితుల చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 17 నుంచి ఆహా తమిళ్ లో
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమాను 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కపిల్ వేలవన్ .. దశ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, గుణవంతన్ .. అర్జున్ దేవ్ .. శరవణన్ .. సాంబశివన్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
కథ విషయానికి వస్తే .. ఆరుగురు స్నేహితులు ఆనందంగా పార్టీ చేసుకుంటారు. అందరూ కూడా విపరీతంగా తాగేస్తారు. రాత్రివేళలో బయల్దేరతారు. మార్గ మధ్యంలో ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ సంఘటనతో వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావొచ్చని మేకర్స్ భావిస్తున్నారు.