ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన ఆడికారు
- ఈ నెల 9న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
- 8 ఏళ్ల చిన్నారి సహా ఐదుగురికి తీవ్ర గాయాలు
- ట్రక్కును ఢీకొట్టి ఆగిన కారు.. నిందితుడి అరెస్ట్
గాయపడిన వారిని లఢీ (40), ఆమె కుమార్తె బిమ్ల (8), భర్త సబామి అలియాస్ చిర్మా (45), రామ్ చందర్ (45), ఆయన భార్య నారాయణి (35)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వేగంగా దూసుకొచ్చిన కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని తొక్కుకుంటూ దూసుకెళ్లింది. అదే వేగంతో ముందుకెళ్తూ ట్రక్కును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మే నెలలోనూ ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపక్కన వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.