నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు... అంతా బ్లడ్ బుక్కే!: రఘురామ
- అమెరికాలో తానా 24వ మహాసభలు
- హాజరైన రఘురామ
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ స్పీకర్
మీరు హోంమంత్రి అయితే రెడ్ బుక్ అమలు చేస్తారా అని యాంకర్ మూర్తి అడగ్గా... తన వద్ద రెడ్ బుక్ ఉండదని, అది వేరే వాళ్ల వద్ద ఉందని రఘురామ బదులిచ్చారు. అయితే, తనదగ్గర బ్లడ్ బుక్ ఉందని స్పష్టం చేశారు. గతంలో తనపై జరిగిన అరాచకాల తాలూకు రక్తపు చారలు తనకు ఇంకా గుర్తున్నాయని రఘురామ అన్నారు. ఆ విధంగా తాను బ్లడ్ బుక్ తో ముందుకెళతానని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.