వేషాలు లేవు .. డబ్బులూ లేవు .. ఏం చేయాలి?: కమెడియన్ రామచంద్ర
- ఆరిస్టుగా ఎంట్రీ ఈజీగానే జరిగింది
- బిజినెస్ లో నష్టాలు చూశాను
- అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి
- అప్పు చేసినా తీర్చే పరిస్థితి లేదు
- ప్లీజ్ అవకాశాలు ఇవ్వండి అంటున్న రామచంద్ర
" ఆరంభంలో అవకాశాలు ఈజీగానే వచ్చినా, ఆ తరువాత అవకాశాలను సంపాదించుకోవడం కోసం చాలానే కష్టాలు పడ్డాను. సంపాదించిన డబ్బులు ఒక బిజినెస్ లో పోగొట్టుకున్నాను. రోడ్డు ప్రమాదానికి గురికావడం వలన మూడేళ్ల పాటు గ్యాప్ వచ్చింది. సంపాదించినప్పుడు దాచుకోకపోవడం వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అవన్నీ కూడా ఫేస్ చేశాను. నా పరిచయస్తులందరి దగ్గర అప్పులు చేశాను" అని చెప్పాడు.
" కొంతమంది దగ్గర చేసిన అప్పు తీర్చాను .. ఇంకా తీర్చవలసినవి ఉన్నాయి. అప్పు తీర్చాలని నాకు ఉంటుంది. కానీ తీర్చే మార్గమే కనిపించడం లేదు. అవకాశాలు రావడం లేదు. అవకాశాల కోసం వెళితే, నా పేరు .. నా ఫేస్ కూడా గుర్తులేవని అనడం నాకు మరింత బాధ కలిగిస్తోంది. అయినా ఇంకా అవకాశాలు వస్తాయనే ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నేను ఆశించేది జాలి .. సానుభూతి కాదు .. అవకాశాలు ఇవ్వమనే కోరుతున్నాను" అని అన్నాడు.