అణుకేంద్రాల ధ్వంసమే టార్గెట్.. ఇరాన్ తో యుద్ధం చేయబోం: అమెరికా
--
ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలపై 14 బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేశామని అమెరికా త్రివిధ దళాల అధిపతి, వైమానిక దళాధిపతి డాన్ కెయిన్ వివరించారు. శుక్రవారం మిస్సోరీలోని ఎయిర్ బేస్ నుంచి రెండు బీ2 బాంబర్లను పంపించామని, అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు చేసి అవి క్షేమంగా తిరిగి వచ్చాయని వివరించారు. ఈ దాడి సమయంలో ఇరాన్ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదని వివరించారు.