ఏపీకి వర్ష సూచన
- ఏపీలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు
- గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో గరిష్ఠంగా 40 మి.మీ, రాజమహేంద్రవరంలో 30 మి.మీ, చిత్తూరులో 19 మి.మీ, అమలాపురంలో 18 మి.మీ, కంభం, కాకినాడలో 13 మి.మీ, యానాం, నెల్లూరులో 6.6 మి.మీ, తణుకులో 4.8 మి.మీ, బాపట్లలో 4.3 మి.మీ, కావలిలో 4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.