భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌కు లైసెన్స్!
- ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్‌కు భారత్‌లో శాట్‌కామ్ లైసెన్స్
- అనుమతి పొందిన మూడో సంస్థగా స్టార్‌లింక్
- టెలికాం విభాగం వర్గాలు ధృవీకరించినట్లు పీటీఐ వెల్లడి
- దరఖాస్తు చేసుకున్న 15-20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ కేటాయింపు
- దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు విస్తృతం
ఈ లైసెన్స్ మంజూరుతో, భారతదేశంలో శాట్‌కామ్ సేవలు అందించేందుకు అనుమతి పొందిన మూడో ప్రైవేటు సంస్థగా స్టార్‌లింక్ నిలిచింది. ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్, రిలయన్స్ జియోకు చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఈ తరహా లైసెన్స్‌లను కలిగి ఉన్నాయి.
స్టార్‌లింక్‌కు లైసెన్స్ జారీ చేసిన విషయాన్ని టెలికాం శాఖ వర్గాలు కూడా ధృవీకరించినట్లు సమాచారం. సంస్థ దరఖాస్తు చేసుకున్న అనంతరం 15 నుంచి 20 రోజుల్లోగా ట్రయల్ స్పెక్ట్రమ్‌ను కేటాయించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొంది.