ఫోన్ ట్యాపింగ్ కేసు... ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట
- తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం
- మూడు రోజుల్లో భారత్‌కు వచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశం
- దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావుకు సూచన
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా ప్రభాకర్ రావు భారతదేశానికి తిరిగి రావాలని, ఇక్కడికి వచ్చిన తర్వాత దర్యాప్తునకు సంపూర్ణంగా సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ప్రభాకర్ రావు భారత్ తిరిగి వచ్చేందుకు వీలుగా ఆయన పాస్‌పోర్ట్‌ను కూడా మంజూరు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆయనపై ఎలాంటి కఠినమైన చర్యలు చేపట్టవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో ఇండియాకు రావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది.