నందిగం సురేశ్ కు రిమాండ్
- జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు
- గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్న పోలీసులు
- టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో నందిగం సురేశ్ అరెస్టు
నందిగం సురేశ్ ను ఆదివారం ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు.. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఉదయం మంగళగిరి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టు ప్రాంగణానికి భారీగా చేరుకున్న నందిగం సురేశ్ అనుచరులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఇతరులు ఎవరినీ కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు.