టీటీడీ కల్యాణ వేదిక కార్యక్రమానికి భారీ స్పందన
- 2016 ఏప్రిల్ 25న టీటీడీ ప్రారంభించిన కల్యాణ వేదిక
- ఈ ఏడాది మే 1 వరకూ ఆ పథకం కింద 26,214 వివాహాలు జరిగాయన్న టీటీడీ
- తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదిక వద్ద వివాహాలు
ఈ పథకం ప్రారంభించిన తర్వాత, ఈ ఏడాది మే 1 వరకు 26,214 వివాహాలు జరిగినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ పథకం ద్వారా వివాహానంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తంగా ఆరుగురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అనంతరం ఉచితంగా ఆరు లడ్డూలను లడ్డూ కౌంటర్ వద్ద అందజేస్తున్నారు.
ఈ పథకం కింద తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరింది. ఇందుకోసం తమ సమీప ప్రాంతాల్లోని నెట్ సెంటర్లలో టీటీడీ వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని, ఇతర వివరాలకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్ నెం. 0877 2263433ని సంప్రదించవచ్చని తెలిపింది.