Rahul Gandhi: ఈ విషయంలో కేంద్రానికి సహకరిస్తాం: 'తెలంగాణ'ను ప్రస్తావించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Supports Nationwide Caste Census
షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కీలక ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో నిర్దిష్ట కాలపరిమితిని కేంద్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన చేపట్టాలనే ఆలోచన తమ పార్టీ దార్శనికతే అని, ఒత్తిడి కారణంగానే కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కులగణన సమానత్వాన్ని సాధించే దిశగా వేసే మొదటి అడుగు అని అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతోనే ఇది విజయవంతమవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని, అయితే దీని అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక, కాలపరిమితి అవసరమని నొక్కి చెప్పారు.

ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా చేపట్టే కులగణనకు తెలంగాణ సర్వే ఒక నమూనా లాంటిదని ఆయన అన్నారు. "కులగణన అనేది సామాజిక న్యాయం దిశగా ఒక నూతన అభివృద్ధి నమూనా. ఇది మా దార్శనికతే. కేంద్రం దీనిని స్వీకరించడం స్వాగతించదగ్గ పరిణామం" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Go Back to Shorts
Rahul Gandhi
Caste Census
India
Congress Party
Telangana
Social Justice
National Census
Census Survey
Rahul Gandhi on Caste Census

More Telugu News