ఎన్నారైలపై జగన్ విషం చిమ్ముతున్నారు: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

Kesineni Nani Accuses Jagan of Targeting NRIs
  • వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్న చిన్ని
  • ఈ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
  • అమరావతికి నిధులు రాకుండా జగన్ అడ్డుకుంటున్నారని విమర్శలు
వైసీపీ హయాంలో ఏపీలో భారీ మద్య కుంభకోణం జరిగిందని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్నారైలపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. ప్రవాసాంధ్రులపై విషం చిమ్మితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. 

ఏపీ రాజధాని అమరావతికి నిధులు రాకుండా జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కేశినేని చిన్ని ఆరోపించారు. రాష్ట్రానికి, రాష్ట్రంలోని నిరుద్యోగులకు నష్టం చేకూరేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 
Go Back to Shorts
Kesineni Nani
Jagan Mohan Reddy
TDP
YSRCP
Andhra Pradesh
Liquor Scam
Amaravati
NRI investments
AP Politics
Telugu Desam Party

More Telugu News