పలు దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు.. కారణమేంటో చెప్పిన వైట్‌హౌస్
- పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన ట్రంప్
- ఉత్తర కొరియా, రష్యా, బెలారస్, క్యూబా సహా పలు దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు
- ఆయా దేశాలపై ఇప్పటికే పలు ఆంక్షలు ఉన్నందున ఈ సుంకాలు వర్తించవన్న వైట్‌హౌస్
ఇక అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్‌లో అమ్ముకోవచ్చని, అయితే కనీసం 10 శాతం సుంకం చెల్లించాలని ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన పలు దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు కల్పించడం జరిగింది. కాగా, భారత్‌పై కూడా 26 శాతం టారిఫ్‌ను విధించిన విషయం తెలిసిందే.