Sitara Ghattamaneni: తండ్రి మహేశ్ బాబు సినిమాపై సితార ఆసక్తికర వ్యాఖ్యలు

Sitaras Comments on Mahesh Babus New Movie
షార్ట్స్‌లో చూడండి
సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దుల తనయ సితారకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకపోయినా ఆమె ఇప్పటికే యాడ్స్ లో నటించింది. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో మహేశ్ బాబు బిజీగా ఉన్నారు. 

నమ్రత, సితార ఈ మధ్య బయట ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా తాను బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న పీఎంజే జ్యువెలర్స్ 40వ షోరూమ్ ప్రారంభోత్సవంలో సితార, నమ్రత సందడి చేశారు. పంజాగుట్టలో ఈ షోరూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో ముచ్చటించారు.

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై మీడియా అడిగిన ప్రశ్నకు సితార సమాధానమిస్తూ... ఈ సినిమాలో నాన్న లుక్ అదిరిపోతుందని చెప్పింది. అందరూ ఊహించిన దానికంటే ఈ సినిమా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ సినిమా గురించి ఇంతకంటే తాను ఎక్కువ మాట్లాడలేనని చెప్పింది. మహేశ్ బాబు ఎప్పుడైనా గిఫ్టులు ఇచ్చారా? అనే ప్రశ్నకు నమ్రత సమాధానమిస్తూ... మహేశ్ కు గిఫ్టులు ఇచ్చే అలవాటు లేదని చెప్పారు. ఎప్పుడూ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని నవ్వుతూ అన్నారు. 
Go Back to Shorts
Sitara Ghattamaneni
Mahesh Babu
Rajamouli
SSMB28
Namrata Shirodkar
Tollywood
Telugu Cinema
Movie News
Celebrity News
Pawan Kalyan

More Telugu News