నాగచైతన్య ఫుడ్ బిజినెస్ పై ఎన్టీఆర్ స్పందన

NTR Reviews Naga Chaitanyas Restaurant in Japan
  • జపాన్ పర్యటనలో ఉన్న ఎన్టీఆర్
  • నాగచైతన్య రెస్టారెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు 
  • ఎన్టీఆర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
హీరో నాగచైతన్య ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య రెస్టారెంట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భం ఎప్పుడంటే.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ దేవర జపనీస్ వర్షన్ మార్చి 28న జపాన్‌లో విడుదలైంది. ఈ క్రమంలో కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ జపాన్ వెళ్లి వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై ఎన్టీఆర్ మాట్లాడారు. ఈ క్రమంలో ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు నాగచైతన్య రెస్టారెంట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జపనీస్ ఫుడ్ కావాలంటే కచ్చితంగా హైదరాబాద్‌లో షోయూ రెస్టారెంట్‌కు వెళ్లాలని అన్నారు. అది తన స్నేహితుడు, నటుడు నాగచైతన్య ప్రారంభించారని తెలిపారు. అతని రెస్టారెంట్‌లో చాలా రకాల ఫుడ్స్ లభిస్తాయని పేర్కొన్నారు.

సుషీ అనే జపనీస్ ఫుడ్‌ను తాను బాగా ఇష్టపడతానని, ఆ ఫుడ్ చాలా అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు. నాగచైతన్య రెస్టారెంట్‌పై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Go Back to Shorts
Naga Chaitanya
NTR
Jr NTR
Food Business
Restaurant
Shoyu Restaurant
Japanese Food
Viral Video
Tollywood
Celebrity Business

More Telugu News