చరణ్‌కు తారక్ బర్త్ డే విషెస్
- ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు
- చెర్రీకి సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న బర్త్‌డే విషెస్
- 'ఎక్స్' వేదికగా చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తారక్
"నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మీపై ఎల్లప్పుడూ ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలి" అని ఎన్‌టీఆర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా, చరణ్, తారక్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో అదరగొట్టిన విషయం తెలిసిందే.
అల్లూరిగా చెర్రీ, కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం ద్వారా ఈ స్టార్ హీరోల ఇమేజ్ గ్లోబల్ లెవెల్‌కి చేరింది. ఈ చిత్రానికి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా దక్కడం విశేషం.