DGGI: ఇల్లీగల్ గేమింగ్ సైట్లపై కొరడా ఝళిపించిన డీజీజీఐ

DGGI Cracks Down on Illegal Gaming Sites
షార్ట్స్‌లో చూడండి
జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్న అక్రమ విదేశీ ఈ-గేమింగ్ వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా ఝళిపించింది. 357 అక్రమ గేమింగ్ సైట్లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) బ్లాక్ చేసింది. 

సుమారు 700 విదేశీ ఈ-గేమింగ్ సంస్థలు డీజీజీఐ స్కానర్ పరిధిలో ఉన్నాయి.ఈ సంస్థలు రిజిస్టర్ చేయడంలో విఫలం కావడం, పన్ను పరిధిలోకి వచ్చే చెల్లింపులను దాచిపెట్టడం, పన్ను బాధ్యతలను తప్పించుకోవడం ద్వారా జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. 

లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ఈ విదేశీ సంస్థలు తప్పుడు బ్యాంక్ ఖాతాల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని డీజీజీఐ తెలిపింది. ఈ క్రమంలో 166 తప్పుడు బ్యాంకు ఖాతాలను కూడా బ్లాక్ చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో డీజీజీఐ ఇప్పటివరకు 357 వెబ్‌సైట్‌లు/యూఆర్ఎల్ లను బ్లాక్ చేసింది. 

గేమింగ్ సైట్లకు సంబంధించి మరో రెండు వేర్వేరు కేసుల్లో డీజీజీఐ దాదాపు 2,400 బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేసి, దాదాపు రూ.126 కోట్లను స్తంభింపజేసింది.
Go Back to Shorts
DGGI
Illegal Gaming Sites
GST Evasion
Online Gaming
Foreign E-Gaming
Blocked Websites
Fake Bank Accounts
India
Tax Evasion
E-Gaming crackdown

More Telugu News