Chandrababu Naidu: ఆర్థిక శాఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu Reviews APs Financial Status
షార్ట్స్‌లో చూడండి
  • రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, ఆర్థిక శాఖలో నెలకొన్న పరిస్థితులపై ఆయన చర్చించారు.
  • కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావలసిన నిధులపై అధికారులతో సమీక్షించారు. కేంద్రంలోని వివిధ శాఖల నుంచి రావలసిన నిధులు సత్వరం పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
  • కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి, నిధులు సకాలంలో విడుదల అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
  • కేంద్ర పథకాలకు సంబంధించి ఐదు శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలియజేశారు.
  • కేంద్రంతో సంప్రదింపులు జరిపి, ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిధులు రాబట్టాలని చంద్రబాబు సూచించారు.
  • ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమీక్షకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AP Finance Department
Central Schemes
Funds
Financial Review
State Budget
Economic Review
Payyavula Keshav
Ronald Ross

More Telugu News