ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు.. కేకేఆర్ జట్టుకు షారుఖ్ కీలక సందేశం.. ఇదిగో వీడియో!
"మీ అందరిపై దేవుడి కరుణ ఉండాలి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని చక్కగా చూసుకుంటున్న చంద్రకాంత్ గారికి బిగ్ థ్యాంక్స్. కొత్తగా జట్టులో చేరిన వారికి స్వాగతం. ఈ సీజన్‌లో మనల్ని నడిపించనున్న కెప్టెన్ అజింక్య రహానెకు ధన్యవాదాలు. మీ అందరికీ ఈ టీమ్ ఇల్లులా మారుతుందని ఆశిస్తున్నా" అని షారుఖ్ అన్నారు. కాగా, ఈ రోజు రాత్రి 7.30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో కేకేఆర్ తలపడనున్న విషయం తెలిసిందే.