మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు
- మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా
- ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రావడం తన జీవితంలో చూడలేదన్న కీరవాణి
- ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం సాహసంతో కూడుకున్న పని అని వ్యాఖ్య
ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రావడం తన జీవితంలో చూడలేదని ఆయన అన్నారు. ఈ సినిమా జోనర్ మాత్రమే సాహసం కాదని... ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం తనకు అడ్వెంచర్ తో కూడుకున్న పని అని చెప్పారు. ఇది చాలా కష్టమైన ప్రయాణమని... కానీ, తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. సరికొత్త సౌండ్స్ ని ఈ జోనర్ కోసం సృష్టించబోతున్నానని చెప్పారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించడాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నానని అన్నారు.