Rajiv Yuva Vikasam: తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త.. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ

Telangana CM Revanth Reddy Will Launch Rajiv Yuva Vikas Scheme Today
షార్ట్స్‌లో చూడండి
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో నేటి నుంచి ఓ కొత్త పథకం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా స్వయం ఉపాధి కోరుకునే యువతకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం రూ. 6 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 5 లక్షల మందికి ఈ పథకం కింద సాయం అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఈ పథకంలో భాగంగా దరఖాస్తు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకంపై నిన్న బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు. 
Go Back to Shorts
Rajiv Yuva Vikasam
Revanth Reddy
Telangana

More Telugu News