పవన్ కల్యాణ్ కు, జనసైనికులకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
- నేడు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం
- పిఠాపురం నియోజకవర్గంలో భారీ సభ
- సోషల్ మీడియాలో స్పందించిన సీఎం చంద్రబాబు
జన సేవా నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు, ముఖ్య నేతలకు, జనసైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు తాను, పవన్ కల్యాణ్ కలిసి అభివాదం చేస్తున్న ఫొటోను కూడా పంచుకున్నారు.