బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు
Add ap7am to your home Screen

బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

Car Accident in Balakrishna House in Jubilee Hills Road No1 Hyderabad
    
టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. కారు మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-45 మీదుగా చెక్ పోస్ట్‌ వైపు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. 

ఈ ఘ‌ట‌న‌లో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమయ్యాయి. అయితే, డ్రైవర్‌ అతివేగంతో పాటు నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Car Accident
Balakrishna
Jubilee Hills
Hyderabad
Telangana

More Telugu News