Nagababu: నాగబాబు ఆస్తులు, అప్పులు... అఫిడవిట్ వివరాలు ఇవిగో!

Nagababu files affidavit while submitting his MLC nomination
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను పేర్కొన్నారు. 

తన పేరిట, తన భార్య పేరిట ఉన్న మొత్తం చరాస్తుల విలువ రూ.59.12 కోట్లు అని వెల్లడించారు. రూ.11.20 కోట్ల మేర స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. బ్యాంకులో రూ.23 లక్షలు, చేతిలో రూ.21 లక్షలు ఉన్నాయని వివరించారు. అత్యధికంగా మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో రూ.55 కోట్లు ఉండగా... ఇతరులకు నాగబాబు ఇచ్చిన అప్పులు కోటి రూపాయల వరకు ఉన్నాయి. 

ఇక నాగబాబు వద్ద ఉన్న బంగారం విలువ రూ.18 లక్షలు కాగా... ఆయన భార్య వద్ద ఉన్న వజ్రాల విలువ రూ.16 లక్షలు, బంగారం విలువ రూ.57 లక్షలు, వెండి విలువ రూ.21 లక్షలు అని అఫిడవిట్ లో వివరించారు. అంతేకాకుండా... రూ.67 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు, రూ.11 లక్షల విలువ చేసే హ్యుండాయ్ కారు ఉన్నాయి. 

రంగారెడ్డి జిల్లాలో రూ.3.55 కోట్ల విలువైన భూమి... మెదక్ జిల్లా నర్సాపూర్ లో రూ.32 లక్షల విలువైన భూమి... అక్కడే మరో సర్వే నెంబరులో రూ.50 లక్షల విలువైన భూమి... రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో రూ.53 లక్షల విలువైన భూమి ఉంది. హైదరాబాద్ లోని మణికొండలో రూ.2.88 కోట్ల విలువైన విల్లా ఉంది. 

అప్పుల విషయానికొస్తే... తన అన్నయ్య చిరంజీవి నుంచి రూ.28 లక్షలు, తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి రూ.6.90 లక్షలు అప్పుగా తీసుకున్నట్టు అఫిడవిట్ లో పొందుపరిచారు. బ్యాంకుల్లో హౌసింగ్ లోన్ రూ.56 లక్షలు, కారు లోన్ రూ.7 లక్షలు... ఇతర వ్యక్తులు, సంస్థల నుంచి మరో రూ.1.64 కోట్లు అప్పుగా తీసుకున్నట్టు నాగబాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Nagababu
Affidavit
Nomination
MLC
Janasena
Andhra Pradesh

More Telugu News