మహిళా దినోత్సవం జరుపుకోవడం సమాజ బాధ్యత : ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu wishes International womens day
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
  • టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని వెల్లడి
  • ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో రూ.4,332 కోట్ల కేటాయింపు చేశామన్న సీఎం  
మహిళా దినోత్సవం జరుపుకోవడం అనవాయితీ కాదని, ఇది సమాజ బాధ్యత అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని, మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందేనన్నారు. తాజాగా 2025- 26 వార్షిక బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా రూ.4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
 
అలాగే ‘దీపం 2’ స్కీమ్ కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్ వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామన్నారు. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది అని బలంగా నమ్మి పనిచేస్తున్నామని, మహిళ భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. 
Advertisement
CM Chandrababu
International womens day
TDP

More Telugu News