దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడానికే... డీలిమిటేషన్: సీఎం రేవంత్ రెడ్డి
- ఇండియా టుడే సదుస్సులో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- దక్షిణాదిలో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదని వెల్లడి
- ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రంలోనూ అధికారంలో లేదని వివరణ
- ఏపీలో కేవలం జూనియర్ భాగస్వామిగానే ఉందని వ్యాఖ్యలు
డీలిమిటేషన్ అమలు జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకే లబ్ధి చేకూరుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కేంద్రం ఆదేశాలతోనే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేశాయని అన్నారు. కేంద్రం మరో 30 ఏళ్ల పాటు డీలిమిటేషన్ ను వాయిదా వేయాలని, అప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా ఏ రీతిలో పెరుగుతుందో చూడాలన్నారు.
జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.