రేవంత్ రెడ్డి గాలి మాటలకు ప్రజలే సమాధానం చెప్పారు: కిషన్ రెడ్డి
--
ఈమేరకు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఎకరాకు రూ.15 వేలు, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలనెలా రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఈ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.