Advertisement

అక్కడ మూడో భాషగా దేనిని నేర్పుతారు?: స్టాలిన్ ప్రశ్న

MK Stalin questions Centre over NEP
  • మూడో భాషకు అనుమతిస్తే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారన్న స్టాలిన్
  • ఉత్తరాదిన మూడో భాషగా దేనిని నేర్పుతారని ప్రశ్న
  • ఉత్తరాదిన రెండు భాషలే నేర్పిస్తే, ఇక్కడ మూడోది ఎందుకని ప్రశ్న
త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే, ఉత్తరాదిన మూడో భాషగా దేనిని నేర్పిస్తారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య జాతీయ విద్యావిధానం అమలు విషయంలో వివాదం కొనసాగుతోంది. స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్ వ్యతిరేకించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. తమిళనాడులో విద్యార్థులకు మూడో భాషను నేర్చుకోవడానికి ఎందుకు అనుమతించడం లేదని కొంతమంది తమను అడుగుతున్నారని, మరి ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారో చెప్పడం లేదని ప్రశ్నించారు. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ దక్షిణాదిలో మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

Advertisement
MK Stalin
Tamil Nadu
Hindi
BJP

More Telugu News