విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్.. 6న భువనేశ్వరి శంకుస్థాపన
- 16వ నంబర్ జాతీయ రహదారిపై భవన నిర్మాణం
- ఇటీవల ఇక్కడ 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేసిన ట్రస్ట్
- జీ ప్లస్ 5 విధానంలో అత్యంత అధునాతనంగా నిర్మాణం
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విజయవాడ భవనం పూర్తయితే ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇందుకోసం హైదరాబాద్ ట్రస్ట్ భవన్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను విజయవాడ కార్యాలయానికి బదిలీ చేస్తారు. అవసరాన్ని బట్టి స్థానికంగానూ కొందరిని నియమించుకుంటారు.