ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్న పవన్ కల్యాణ్... కారణం ఇదే!
Add ap7am to your home Screen

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్న పవన్ కల్యాణ్... కారణం ఇదే!

Reason for Pawan Kalyan not voted in Graduate MLC Elections
  • ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు
  • పవన్ గ్రాడ్యుయేట్ కాకపోవడంతో ఓటు వేయలేని వైనం
  • ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, లోకేశ్
ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గుంటూరు-కృష్ణా జిల్లాలు... ఉభయగోదావరి జిల్లాల నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. ఉండవల్లిలోని పోలింగ్ బూత్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఈ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓటు వేయలేకపోయారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం పట్టభద్రులు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ గ్రాడ్యుయేట్ కాదన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. మరోవైపు, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ పవన్ ఓ వీడియోను విడుదల చేశారు.  
Advertisement
Pawan Kalyan
Jana Reddy
Graduate MLC Elections

More Telugu News