Revanth-DK Aruna: ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, డీకే అరుణ... ఫొటో ఇదిగో!

Revanth Reddy and DK Aruna shares same stage in Narayanpet district
షార్ట్స్‌లో చూడండి
సీఎం రేవంత్ రెడ్డి నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించారు. అప్పక్ పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణ కనిపించారు. రేవంత్ రెడ్డిపై డీకే అరుణ పలు సందర్భాల్లో విమర్శలు చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇక, రేవంత్ రెడ్డి, డీకే అరుణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలుమార్లు రేవంత్, డీకే అరుణ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది.
Go Back to Shorts
Revanth-DK Aruna
Congress
BJP
Narayanpet District

More Telugu News