జడ్జి సమక్షంలో పందెం కోళ్లకు వేలం... భారీ ధర పలికిన కోళ్లు
- మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందేలు
- పందెంరాయుళ్లను, కోళ్లను పట్టుకున్న పోలీసులు
- పట్టుకున్న కోళ్లకు రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో వేలంపాట
వేలంపాటలో 16 మంది అడ్వొకేట్లు, 57 మంది పౌరులు పాల్గొన్నారు. ఇటీవల పట్టుబడ్డ పందెంరాయుళ్లు కూడా వేలంలో పాల్గొనడం గమనార్హం. 10 కోళ్లను ఒక స్లాట్ గా చేసి వేలం నిర్వహించారు. 10 కోళ్ల స్లాట్ ను శ్రీనివాస్ అనే వ్యక్తి రూ. 2,50,000కు కొనుగోలు చేశారు. రూ. 50 వేల నుంచి వేలంపాట మొదలయింది. మొత్తం 84 కోళ్లకు వేలంపాట నిర్వహిస్తున్నారు. వేలంపాట ఇంకా కొనసాగుతోంది.