స్టాక్ మార్కెట్లలో 8 రోజుల వరుస నష్టాలకు బ్రేక్

Stock markers ends in profits after 8 sessions
  • ట్రేడింగ్ చివర్లో సూచీలకు కొనుగోళ్ల మద్దతు
  • 57 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
  • 30 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. వరుసగా 8 సెషన్లుగా నష్టాలను చవిచూసిన మార్కెట్లు... ఈరోజు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు... చివర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి అడుగుపెట్టాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 57 పాయింట్ల లాభంతో 75,996 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 22,959 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో మన రూపాయి మారకం విలువ రూ. 86.87గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.83%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.31%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.25%), అదానీ పోర్ట్స్ (1.83%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.81%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-3.75%), భారతి ఎయిర్ టెల్ (-2.42%), టీసీఎస్ (-0.75%), ఇన్ఫోసిస్ (-0.74%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.57%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News