ప్రేమికుల రోజు స్పెష‌ల్‌... 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' నుంచి బిగ్ అప్‌డేట్‌
Add ap7am to your home Screen

ప్రేమికుల రోజు స్పెష‌ల్‌... 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' నుంచి బిగ్ అప్‌డేట్‌

2nd Single From Hari Hara Veera Mallu on Feb 24th
  • ప‌వ‌న్ ఫ్యాన్స్ కు లవర్స్‌ డే ట్రీట్ ఇచ్చిన‌ మేక‌ర్స్‌
  • సినిమాలోని సెకండ్ సింగిల్‌ విడుద‌ల తేదీ ప్ర‌క‌ట‌న‌
  • ఈ నెల 24న‌ 'కొల్లగొట్టిందిరో' అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ రిలీజ్‌  

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా నుంచి ప్రేమికుల రోజు సంద‌ర్భంగా బిగ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా సెకండ్‌ సింగిల్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. 'కొల్లగొట్టిందిరో' అంటూ సాగే... రొమాంటిక్‌ సాంగ్‌ ను ఫిబ్రవరి 24న‌ మధ్యాహ్నం 3 గంటలకు విడుద‌ల చేయనున్నట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

ఈ మేరకు హీరోహీరోయిన్లు పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ లతో కూడిన రొమాంటిక్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్ట‌ర్ లో నిధి అగ‌ర్వాల్ ను ప‌వ‌న్ పొగుడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది. ప‌వ‌న్ వాలంటైన్స్ డే ట్రీట్ ఇచ్చారంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

కాగా, హరిహర వీరమల్లు చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర సగ‌భాగానికి పైగా ద‌ర్శకత్వం వహించారు. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోవ‌డంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం ర‌త్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 
Advertisement
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Tollywood

More Telugu News