Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం 13 రోజుల వసూళ్లు ఎంతో తెలుసా!

 do you know the Sankranthiki Vasthunam collections in 13 days
షార్ట్స్‌లో చూడండి
వెంకటేష్‌ కథానాయకుడిగా, ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతి వస్తున్నాం'. అనిల్‌  రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల నీరాజనాలు పొందుతూ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఈ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. 

వెంకటేష్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటు కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్‌లో ఆల్ టైమ్స్‌ రికార్డ్స్‌ను క్రియేట్‌ చేస్తోంది. 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.208 కోట్ల 9 లక్షలు గ్రాస్‌ సాధించగా, రూ.121 కోట్ల 35 లక్షల షేర్‌ను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం పదమూడు రోజుల్లో సాధించిన వసూళ్ల వివరాలు ఇవి.. 

పదమూడు రోజుల షేర్‌ వివరాలు 
నైజాం: 31 కోట్ల 85 లక్షలు 
వైజాగ్‌: 15 కోట్ల 96 లక్షలు 
ఈస్ట్‌: 10 కోట్ల 64 లక్షలు 
వెస్ట్‌: 7 కోట్లు 
కృష్ణ: 7 కోట్ల 47 లక్షలు 
గుంటూరు: 7 కోట్ల 58 లక్షలు 
నెల్లూరు: 3 కోట్ల 62 లక్షలు 
సీడెడ్‌: 15 కోట్ల 18 లక్షలు 
నైజాం ప్లస్‌ ఏపీ టోటల్‌: 99 కోట్ల 30 లక్షలు 
కర్ణాటక 5 కోట్ల 13 లక్షలు 
తమిళనాడు: 74 లక్షలు 
రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా: 1 కోటి 40 లక్షలు 
యూఎస్‌, కెనడా: 11 కోట్ల 90 లక్షలు 
ఇతర దేశాల్లో : 2 కోట్ల 88 లక్షలు 

టోటల్‌గా వరల్డ్‌ వైడ్‌ షేర్‌ రూ. 121 కోట్ల  35 లక్షలు 

టోటల్‌గా వరల్డ్ వైడ్‌ గ్రాస్‌: రూ.208 కోట్ల 9 లక్షలు
Go Back to Shorts
Sankranthiki Vasthunam
Venkatesh Daggubati
Anil ravipudi
meenakshi chaudhary
Sankranthiki Vasthunam collections
tollywood
aishwarya rajesh

More Telugu News